సచిన్ 100 సెంచరీల రికార్డ్ అతను మాత్రమే బ్రేక్ చేయగలడు – బ్రాడ్ హగ్

Tuesday, July 7th, 2020, 12:12:42 AM IST


ప్రపంచ క్రికెట్ కె తలమానికంగా సచిన్ పేరు చరిత్రలో లిఖించబడినది. అయితే ఎందరో ఆటగాళ్లకు సచిన్ టెండూల్కర్ ఒక స్పూర్తి. అయితే క్రికెట్ చరిత్రలో సచిన్ సాధించిన రికార్డులు కోకొల్లలు. అయితే సచిన్ 100 సెంచరీ ల రికార్డ్ మాత్రం అందుకోవడం ఏ క్రికెటర్ కి అయినా కష్టమే అని చెప్పాలి. అయితే ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రాడ్ హగ్ సచిన్ 100 సెంచరీ ల పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సచిన్ టెండూల్కర్ యొక్క అసాధారణ విజయాలను అధిగమించడానికి విరాట్ కోహ్లీ కి ప్రతిభతో పాటుగా, ఫిట్నెస్ మరియు మానసిక సామర్ధ్యం లభించాయి అని వ్యాఖ్యానించారు. సచిన్ అన్ని ఫార్మాట్ లలో కలిపి 34,357 పరుగులు చేయగా, 200 టెస్ట్ మ్యాచ్ లలో 15,921 మరియు 463 వన్డే మ్యాచ్ లలో 18,426 పరుగులు చేశారు. అయితే అంతర్జాతీయ క్రికెట్ లో 100 సెంచరీ లు సాధించిన సచిన్ రికార్డ్ ను విరాట్ కోహ్లీ బ్రేక్ చేయగలడు అని బ్రాడ్ హగ్ అన్నారు.

కోహ్లీ మాత్రమే ఈ రికార్డ్ ను సాధించగలడు అని వ్యాఖ్యానించారు. అయితే సచిన్ 49 సెంచరీ లు వన్డే మ్యాచ్ లలో, 51 సెంచరీ లు టెస్ట్ మ్యాచ్ లలో సాధించారు. ప్రస్తుతం కోహ్లీ 43 వన్డే శతకాలు మరియు 27 టెస్ట్ శతకాలు బాదాడు. అయితే 70 సెంచరీ లతో కోహ్లీ ఈ రికార్డ్ ను అందుకొనే అవకాశం ఉంది అని తన అభిప్రాయం చెప్పారు బ్రాడ్ హగ్. అయితే సచిన్ టెండూల్కర్ సైతం తన 100 సెంచరీ ల రికార్డ్ ను రోహిత్ శర్మ లేదా కోహ్లీ అందుకొనే అవకాశం ఉందని గతంలో చెప్పారు.