ముఖ్యమంత్రి ని కలుసుకున్న బ్యాడ్మింటన్ ఛాంపియన్

Wednesday, August 28th, 2019, 09:10:22 PM IST

ఇటీవల జరిగిన ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో భారత క్రీడాకారిణి పీవీ సింధు బంగారు పథకాన్ని సాధించిన సంగతి మనకు తెలిసిందే. కాగ నేడు పీవీ సింధు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ని ప్రగతి భవన్ లో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. కాగా పీవీ సింధు ని కెసిఆర్ ప్రశంసలతో ముంచెత్తాడు. అంతేకాకుండా భవిష్యత్తులో జరిగే టోర్నమెంట్లలో పాల్గొనడానికి అవసరమైన ఏర్పాట్లను అన్నింటిని ఇకనుండి ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో విజేతలను అందించే వేదికగా హైదరాబాద్ ఉందని కెసిఆర్ వెల్లడించారు. అంతేకాకుండా పీవీ సింధుకు పుష్పగుచ్చం ఇచ్చి, షాలువా కప్పి సన్మానించారు సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, డిజిపి మహేందర్ రెడ్డి, పోలీస్ కమీషనర్లు అంజనీ కుమార్, విసి సజ్జనార్, మహేష్ భగవత్, ఇంటెలిజెన్స్ ఐజి నవీన్ చంద్ తదితరులు పాల్గొన్నారు.

ఈమేరకు మాట్లాడిన కెసిఆర్ ” బ్యాడ్మింటన్ కళాకారిణి పీవీ సింధు మన దేశ గౌరవాన్ని నిలబెట్టింది. పీవీ సింధు మన దేశానికే గర్వకారణం… ఇలాంటి గంతలు సాధించడం అనేది ఆషామాషీ విషయం కాదు. అందుకోసం ఎంతో కఠోర శ్రమ, సాధన, శ్రద్ధ తోడై ఉండాలి అని అన్నారు. అంతేకాకుండా కోచ్ పుల్లెల గోపిచంద్ చక్కగా తీర్చి దిద్దారు. వీరు ఇంకా ఇలాంటి పథకాలు ఎన్నో సాధించి మనదేశానికి చక్కటి పేరు తేవాలని ” అని పీవీ సింధు ని ప్రశంసలతో ముంచెత్తారు.