బిగ్ న్యూస్: జాతీయ పార్టీలోకి బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్!

Wednesday, January 29th, 2020, 01:03:35 PM IST

బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జాతీయ పార్టీ బీజేపీ లో చేరనున్నట్లు సమాచారం. సైనా నెహ్వాల్ బీజేపీ లో చేరనున్న విషయం పట్ల క్రీడా, రాజకీయ రంగాలలో హాట్ టాపిక్ అయింది. ఈ విషయాన్నీ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ విషయాన్నీ దృవీకరించినట్లు సమాచారం. గతంలో సైనా నెహ్వాల్ అనేక సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. వివాదాస్పద సిఏఏ మరియు ఎన్ఆర్సి కు మద్దతు ఇచ్చిన ప్రముఖులలో సైనా ఒకరు.

అయితే సైనా నెహ్వాల్ ఇప్పటివరకు 24 అంతర్జాతీయ టైటిల్స్ గెలుపొందింది. అంతేకాకుండా 2009 లో వరల్డ్ నెంబర్ 2, 2015 లో వరల్డ్ నెంబర్ 1 ఛాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. పుల్లెల గోపీచంద్ వద్ద కోచింగ్ తీసుకున్న సైనా నెహ్వాల్ విజయవంతమైన క్రీడాకారిణిగా రాణించడమే కాకుండా దేశానికి, రాష్ట్రానికి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చింది. 2015 లో నెంబర్ వన్ షట్లర్ గా ప్రపంచ రికార్డు సృష్టించింది సైనా నెహ్వాల్.