బిగ్ బ్రేకింగ్ : క్రికెటర్లకు షాకిచ్చిన బీసీసీఐ – ఐపీఎల్ ప్రైజ్ మనీ భారీగా తగ్గింపు…

Wednesday, March 4th, 2020, 02:37:06 PM IST

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ క్రికెట్ లీగ్ ప్రారంభమవబోతుంది… అయితే ఈ ఐపీఎల్ మ్యాచులకు ఎలాంటి ఆదరణ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఈ ఐపీఎల్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది. మరికొద్ది రోజుల్లో ఈ ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ ఒక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్ ప్రైజ్ మనీని తగ్గిస్తూ బీసీసీఐ సంచలన ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇప్పటికే జరిగినటువంటి సీజన్లలో ఐపీఎల్ విజేత ప్రైజ్ మనీ 20కోట్లు ఉండగా, ఈసారి మాత్రం 10కోట్లకు తగ్గించేశారు. అలాగే రన్నరప్ కి ప్రైజ్ మనీ గత ఏడాది 12.5 కోట్లు గా ఉండగా ఈ ఏడాది 6.25 కోట్లు గా నిర్ణయించారు.

దానికి తోడు ఆ తరువాత స్థానాల్లో నిలిచిన మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న జట్లకు గత ఏడాది 6.25కోట్ల ప్రైజ్ మనీ దక్కగా ఈఏడాది దాన్ని 4.37 కోట్లకు పరిమితం చేశారు. అయితే ఇదివరకులాగా ఉన్న అన్ని ప్రైజ్ మనీ ని కూడా బీసీసీఐ తగ్గించేసింది. కాగా ప్రతీసారి సీజన్లకు ఎక్కువగా డబ్బులు ఖర్చు అవుతుందనే కారణంగా, ఆ ఖర్చులన్నింటిని తగ్గించేందుకు బీసీసీఐ ఈ సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుందని సమాచారం.