ఐపియల్ 2021 షెడ్యూల్ ను విడుదల చేసిన బీసీసీఐ

Sunday, March 7th, 2021, 07:15:40 PM IST

ఆదివారం నాడు బీసీసీఐ ఐపియల్ 2021 షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ సీజన్ ఏప్రిల్ 8 వ తేదీన ప్రారంభం కానుంది. అయితే గత సీజన్ ఆరు నెలలు వాయిదా పడి యూఏఈ లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది అనుకున్న సమయానికే ఐపియల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతా నగరాలను వేదికలు గా ఎంపిక చేసింది బీసీసీఐ. తొలి మ్యాచ్ ఏప్రిల్ 9 వ తేదీన చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. అదే విధంగా మే 30 వ తేదీన మోతేరా స్టేడియం లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్లే ఆఫ్ మ్యాచ్ లు సైతం మోతేరా స్టేడియం లో జరగనున్నాయి.

అయితే హైదరాబాద్ కి వేదిక లు దక్కకపోవడం పట్ల అభిమానులు నిరాశ లో ఉన్నట్లు తెలుస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులకు సొంత మైదానాలు ఈ ఏడాది ఇక లేవని చెప్పాలి. అయితే మధ్యాహ్నం మ్యాచ్ లు 3:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. అదే విధంగా రాత్రి మ్యాచ్ లు 7:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.