బిగ్ న్యూస్: ఈ సీజన్ ఐపియల్ మ్యాచులు వాయిదా…బీసీసీఐ కీలక నిర్ణయం!

Tuesday, May 4th, 2021, 02:10:04 PM IST


కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మహమ్మారి దెబ్బకు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు భారత్ లో. అయితే తాజాగా ఐపిఎల్ ఆటగాళ్ళు కరోనా వైరస్ భారిన పడుతున్నారు. పలు జట్ల ఆటగాళ్లకు కరోనా వైరస్ సోకడం తో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ ఐపియల్ మ్యాచులను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల కీలక ప్రకటన చేశారు. అయితే రెండు రోజులు గా పలువురు ఆటగాళ్ళు కరోనా వైరస్ భారిన పడ్డారు.

అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అయిన వృద్దిమాన్ సాహ కి కరోనా వైరస్ నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం తెలియడం తో సన్ రైజర్స్ టీమ్ అంతా కూడా ఐసోలేషన్ కి వెళ్ళింది. అదే తరహాలో ఢిల్లీ క్యాపిటల్స్ కి చెందిన అమిత్ మిశ్రా కి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. అంతేకాక సిబ్బందికి సైతం కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. కోల్కతా ఆటగాళ్లకు, చెన్నై బౌలింగ్ కోచ్ కి కరోనా వైరస్ సోకడం ఆందోళన కలిగించే అంశం అని చెప్పాలి. ఈ మేరకు బీసీసీఐ తాజా ఐపియల్ సీజన్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు కీలక ప్రకటన చేయడం జరిగింది.