బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తించిన బుమ్రా.. హ్యాట్రిక్ విరాట్ కె దక్కుతుంది…

Sunday, September 1st, 2019, 03:59:04 PM IST

వెస్టిండీస్ తో జరుగుతున్నా రెండో టెస్ట్ మ్యాచ్ కి సంబందించిన విషయాలను బుమ్రా ఇలా ప్రస్తావించారు. తాను హ్యాట్రిక్ వికెట్లు తీయడం పట్ల ఆనందాన్ని వ్యక్త పరుస్తూనే, ఆ ఘనత కెప్టెన్ విరాట్ కోహ్లీకి చెందుతుంది అంటూ వ్యాఖ్యలు చేసారు. సాధారణం గా టెస్ట్ మ్యాచ్ లో వికెట్ పడగొట్టాలంటే చాల కష్టతరమనే చెప్పాలి. అలాంటి టెస్ట్ మ్యాచ్ లో వరుసగా మూడు వికెట్లను తీయడం సాధారణ విషయం కాదు. హ్యాట్రిక్ వికెట్లని తీసిన మూడో భారతీయుడిగా బుమ్రా రికార్డులకెక్కాడు.

మూడో వికెట్ గా రోస్టర్ చేజ్ ని అవుట్ చేసినప్పుడు తాను సందిగ్ధం లో వున్నానని, అసలు అప్పీలు కోరాలి అని అనుకోలేదని వివరించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ సమీక్ష కోరడం తో హ్యాట్రిక్ సాధ్యమైందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వెస్టిండీస్ తో రెండో టెస్ట్ ఆడుతున్న భారత్ ఈ మ్యాచ్ ని గెలిస్తే పలు రికార్డు లని నమోదు చేయడానికి సిద్ధంగా వుంది.