స్పిన్ దెబ్బకు చేతులెత్తేసిన రాజస్థాన్ రాయల్స్.. చెన్నై సూపర్ విక్టరీ..!

Tuesday, April 20th, 2021, 01:00:15 AM IST

ముంబై వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. 45 పరుగుల తేడాతో ధోనీ సేన సూపర్ విక్టరీ నమోదు చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టులో డు ప్లెసిస్(33), రాయుడు (27), మొయీన్ అలీ (26), బ్రావో (20 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ ‌బౌలర్లలో చేతన్‌ సకారియా 3 వికెట్లు తీసుకోగా, క్రిస్ మోరీస్, ముస్తాఫిజర్ 2 వికెట్లు, పరాగ్ ఒక వికెట్ తీసుకున్నాడు.

అనంతరం 189 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఓపెనర్ బట్లర్ 49 పరుగులు మినహా మిగతా బ్యాట్స్‌మెన్స్ ఎవరూ రాణించలేదు. చెన్నై బౌలర్ల స్పిన్ దెబ్బకు బ్యాట్స్‌మెన్స్ అంతా చేతులేత్తేశారు. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ మూడు వికెట్లతో సత్తా చాటగా, జడేజా, కర్రన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచ్ విజయంతో ఈ సీజన్‌లో మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలను నమోదు చేసుకున్న చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.