చిత్తుగా ఓడిన పంజాబ్.. విజయంతో చెన్నై బోణీ..!

Saturday, April 17th, 2021, 12:00:44 AM IST

ముంబై వేదికగా పంజాబ్ కింగ్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ జట్టును చెన్నై పేసర్ దీపక్‌ చహర్‌ కోలుకోలేని దెబ్బ తీశాడు. ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్ ‌(5), మయాంక్‌ అగర్వాల్ ‌(0)తో పాటు క్రిస్‌ గేల్‌(10), దీపక్‌ హుడా (10), నికోలస్‌ పూరన్‌ (0) టాప్‌ ఆర్డర్‌ మొత్తం పూర్తిగా విఫలమయ్యారు. అయితే షారుఖ్ ఖాన్ (47) పరుగులు చేయడంతో పంజాబ్ జట్టి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 106 పరుగులు మాత్రమే చేసింది. చెన్నై బౌలర్లలో దీపక్ చహర్ 4 వికెట్లు పడగొట్టగా సామ్ కరన్, మొయిన్ అలీ, డ్వేన్ బ్రేవో తలో వికెట్ తీసుకున్నారు.

అనంతరం 107 పరుగుల స్వల్ఫ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు మరో 26 బంతులు మిగిలుండగానే టార్గెట్ అందుకుంది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(5) వెంటనే అవుటైనా మరో ఓపెనర్ ఫాఫ్ డూ ప్లెసిస్(33), మొయీన్ అలీ(46) పరుగులతో రాణించారు. అయితే విజయానికి మరో 17 పరుగులు కావల్సి ఉన్న సమయంలో మొయీన్ అలీ అవుట్ కాగా ఆ తర్వాత వచ్చిన సురేశ్ రైనా(8), అంబటి రాయుడు(0) వెనువెంటనే పెవిలియన్ చేరినా చివర్లో శామ్ కర్రాన్(5)తో కలిసి డూ ప్లెసిస్ జట్టిను గెలిపించాడు. ఈ విజయంతో చెన్నై ఈ సీజన్‌లో బోణీ కొట్టింది. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమి 2 వికెట్లు తీయగా, అర్షదీప్ సింగ్, మురుగన్ అశ్విన్ చెరో వికెట్ లభించింది.