ఐపీఎల్ కోసం చెన్నై కి చేరుకున్న ధోని కి ఘన స్వాగతం

Monday, March 2nd, 2020, 09:34:55 AM IST

మహేంద్ర సింగ్ ధోని కి చెన్నై లో ఘన స్వాగతం లభించింది. 2019 ప్రపంచ కప్ సెమి ఫైనల్ మ్యాచ్ తర్వాత ఇప్పటివరకు ధోని ఎలాంటి మ్యాచ్ లో ఆడలేదు. అయితే ఈ విరామ సమయం లో ధోని ఇండియన్ ఆర్మీ కి సేవలు అందించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రతి ఏడాది ఐపీఎల్ కోసం పలు జట్లు పోటీ పడుతూనే ఉంటాయి. ఈసారి కూడా చెన్నై జట్టు ఫేవరేట్ అని చెప్పాలి. మార్చి 29 నుండి మొదలు కానున్న ఈ ఐపీఎల్ కోసం ధోని ట్రైనింగ్ కోసం చెన్నై విచ్చేసారు. మొదటి మ్యాచ్ ముంబై లోని వాంఖడే స్టేడియం లో ముంబై ఇండియన్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. అయితే ధోని రాకని సీఎస్కె తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది. అయితే ధోనికి సంబంధించిన ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.