వాళ్ళ బౌలింగ్ యూనిట్ గురించి చర్చిస్తున్నాం – డేవిడ్ వార్నర్

Saturday, November 7th, 2020, 06:30:35 PM IST

ఈ ఏడాది ఐపియల్ సీజన్ లేట్ గా ప్రారంభం అయినా, ప్రతి ఒక్క మ్యాచ్ కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమి పై ఇప్పటికే సోషల్ మీడియా వేడిగా పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ మేరకు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే ప్లే ఆఫ్ కి చేరాలంటే టాప్ త్రీ టీమ్స్ ను ఒడించాలి అని తెలుసు అని పేర్కొన్నారు. అలాగే ఇక్కడి వరకు వచ్చి మ్యాచ్ గెలుపొందాం అని, ఈ గెలుపు తో ఇప్పుడు ప్రశాంతం గా ఉంది అని తెలిపారు. ఈ విజయం పట్ల కీలక భూమిక పోషించిన ప్లేయర్ల పై ప్రశంసల వర్షం కురిపించారు. రషీద్ ఖాన్, నటరాజన్ ప్రభావవంతమయిన ఆటగాళ్ళు అని, తొలి అయిదు ఓవర్లు కూడా సందీప్ శర్మ, హోల్డర్ లతో వేయించాలి అని, ఆ తర్వాత నటరాజన్, రషీద్ లకు అవకాశం ఇవ్వాలి అని అనుకున్నట్లు తెలిపారు.

ఈ క్రమం లోనే రషీద్ పై ఒత్తిడి పెరిగింది అని పేర్కొన్నారు. అయితే కేన్ విలియం సన్ పై ప్రశంసల వర్షం కురిపించారు డేవిడ్ వార్నర్. కేన్ విలువైన ఆటగాడు అని, ఒత్తిడి లో క్రీజులో పాతుకుపోయి రాణించగలదు అని తెలిపారు. అయితే బెంగళూరు లైనప్ చూశాక వికెట్ తేడాగా అనిపించడం తో చక్కగా ఆడాం అని, ఢిల్లీ తో నెక్స్ట్ పోటీ పడి మ్యాచ్ లో వాళ్ల బౌలింగ్ యూనిట్ గురించి ఆలోచిస్తున్నాం అని అన్నారు. అంతేకాక ఆ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయాన్ని వెల్లడించారు.