బ్రేకింగ్: సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా వార్నర్…కారణం అదేనా?

Thursday, February 27th, 2020, 12:28:11 PM IST

ఐపీఎల్ పోరు ఈ సారి ఆసక్తికరంగా మారనుంది. బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది క్రికెట్ కి దూరమైన డేవిడ్ వార్నర్ మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కి సారధిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2016 లో టైటిల్ గెలవడానికి ఎంతగానో శ్రమించిన వార్నర్ మళ్ళి కెప్టెన్ గా ఈ ఏడాది వ్యవహరించనున్నాడు. ఓపెనర్ గా ఎన్నో రికార్డులని నెలకొల్పిన డేవిడ్ వార్నర్ మరోసారి పగ్గాలు చేపట్టడా పట్ల నెటిజన్లు బిన్న విధాలుగా స్పందిస్తున్నారు.

గత రెండు సీజన్ లకు నాయకత్వం వహించిన విలియం సన్ ఇక బ్యాట్సమెన్ గా మాత్రమే వ్యవహరించనున్నారు. అయితే విలియంసన్ కెప్టెన్ గా వ్యవహరించినప్పటికీ రెండు సార్లు టైటిల్ గలవలేకపోయిన సంగతి తెల్సిందే. అయితే సన్ రైజర్స్ కి కెప్టెన్ మారడం తో ఈ సారి టైటిల్ ఫై చాలా కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టాంపరింగ్ వివాదం తో క్రికెట్ కి దూరమైన వార్నర్ బ్రాండ్ వాల్యూ దెబ్బతినే అవకాశం ఉన్నందున కెప్టెన్సీ పగ్గాలు గత సీజన్లో ఇవ్వలేదు. మరొకసారి కెప్టెన్ గా అవకాశం రావడం పట్ల అభిమానులు వార్నర్ కి విషెస్ చెబుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.