కోహ్లీ రికార్డ్‌ను బ్రేక్ చేసిన డేవిడ్ వార్నర్..!

Saturday, November 2nd, 2019, 06:46:09 PM IST

ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ గురుంచి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తను క్రీజ్‌లో ఎక్కువ సమయం ఉన్నాడంటే ప్రత్యర్ధులకు చెమటలు పట్టడం ఖాయం. అయితే వన్‌డే మ్యాచ్‌లలో అయినా టీ ట్వంటి మ్యాచ్‌లలో అయిన రికార్డులు నెలకొల్పడంలో డేవిడ్ వార్నర్ ముందంజలో ఉంటాడు.

అయితే తాజాగా టీ ట్వంటీ మ్యాచ్‌లలో డేవిడ్ వార్నర్ భారత్ కెప్టెన్ కోహ్లీ రికార్డ్స్‌ను బ్రేక్ చేశాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన T20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో 217 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ఒకే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో కోహ్లీ 90,59,50 పరుగులు చేసి ఒక మ్యాచ్‌లో ఔట్ కాగా డేవిడ్ వార్నర్ 100,60,57 పరుగులు చేసి మూడు మ్యాచ్‌లలో నాటౌట్‌గా నిలిచాడు. అంతేకాదు ఆస్ట్రేలియా తరుపున 100 సిక్స్‌లు కొట్టిన రెండవ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.