అమరేంద్ర బాహుబలి అనే నేను.. డేవిడ్ వార్నర్ మరో సంచలనం..!

Sunday, May 17th, 2020, 01:58:20 AM IST

గత కొద్ది రోజులుగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ వరుస పెట్టి టిక్‌టాక్ వీడియోలు చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీ ధరించి అలవైకుంఠపురంలోని బుట్ట బొమ్మ సాంగ్‌కు తన సతీమణితో కలిసి వార్నర్ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ తరువాత మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాలోని డైలాగ్ బ్యాట్ పట్టుకుని చెప్పి అందరి చేత పొగడ్తల వర్షం కురిపించుకున్నాడు.

ఇక మొన్న ఈ మధ్యే మళ్ళీ అలవైకుంఠపురంలోని రాములో రాములో పాటకు ఫ్యామిలీతో కలిసి డాన్సులు చేసాడు. అయితే వార్నర్ వరుస పెట్టి చేస్తున్న వీడియోలకు దక్షిణాది ప్రేక్షకులు ఫిదా అవుతుండగా తాజాగా మరో సంచలనం సృష్టించాడు. ఈ సారి ఏకంగా బిగ్గెస్ట్ టాలీవుడ్ చిత్రం బాహుబలి సినిమాలో ప్రభాస్ చెప్పిన “అమరేంద్ర బాహుబళి అనే నేను” అనే డైలాగ్ చెప్పాడు. అయితే ఆ సినిమాలో ప్రభాస్ ధరించిన కాస్ట్యూమ్స్ మాదిరిగానే ఉన్న కాస్ట్యూమ్స్ ధరించి మరీ చెప్పడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.