లేహ్ నుండి ఢిల్లీ బయలుదేరిన ధోని…

Saturday, August 17th, 2019, 09:30:49 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ఇటీవల తన క్రికెట్ కి తాత్కాలిక విరామం ప్రకటించి ఇండియన్ ఆర్మీ లో విధులు కొనసాగిస్తున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ప్యారాచ్యూట్‌ రెజిమెంట్‌లో గౌరవ లెఫ్టినెంట్‌ హోదాలో ఉన్న మన మహేంద్ర సింగ్ ధోనీ కశ్మీర్‌ లోయలో రెండు వారాల పాటు తన విధులను ఎంతో బాధ్యతగా నిర్వర్తించిన విషయం మనకు తెలిసిందే… కాగా సైన్యంలో ధోనీ సైనిక విధులు గురువారంతోనే ముగిశాయి. ఈమేరకు లేహ్‌ విమానశ్రయం నుంచి ధోని నేడు ఢిల్లీకి పయనమయ్యాడు. కాగా ముందుగా ఢిల్లీ నుండి ధోని స్వస్థలం రాంచీకి వెళ్లనున్నట్లు సమాచారం.

కాగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను లడ్డాఖ్ లో జరుపుకున్న ధోని, ఆ తరువాత అక్కడి సైనిక ఆసుపత్రిలో ఉన్నటువంటి జవానులతో కొద్దిసేపు గడిపారు. ఆ తరువాత సియాచిన్ కి చేరుకొని మన యుద్ధ వీరులకు నివాళులు అర్పించారు. కాగా ఇటీవల జరిగినటువంటి వెస్టిండీస్ టూర్ ని కూడా వదులుకున్న ధోని, సెప్టెంబర్ 15 నుండి స్వదేశంలో జరగనున్న దక్షిణాఫ్రికా టీ 20 సిరీస్ లో పాల్గొననున్నారని సమాచారం. అయితే కాగా ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.