క్రికెట్ మ్యాచ్ లో అంతరాయం – కారణం మైదానం లో పాము

Monday, December 9th, 2019, 04:04:25 PM IST

విజయవాడలో జరుగుతున్నటువంటి రంజీ మ్యాచులలో ఒక విచిత్రమైన సంగతి చోటు చేసుకుంది. కాగా ఎప్పటిలాగే సోమవారం నాడు విజయవాడ లోని మూలపాడులో ఆంధ్ర – విదర్భ జట్ల మధ్య రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైనది. కానీ అంతలోనే అకస్మాత్తుగా ఒక అంతరాయం ఏర్పడింది. మైదానంలో రెండు జట్ల మధ్యన క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక పాము మైదానంలోకి ప్రవేశించింది. అయితే ఆ పామును చూసి భయాందోళనకు గురైన నిర్వాహకులు, ఆటగాళ్లు కొద్దీ సేపు తమ ఆటను నిలిపివేశారు. తరువాత ఆ పామును బయటకు పంపేందుకు అందరు కొన్ని ఫీట్లు చేయాల్సి వచ్చింది. అయితే ఈ ఘటనకు సంబందించిన వీడియోను బీసీసీఐ స్వయంగా తన అధికారి ట్విటర్‌ వేదిక ద్వారా అందరితో పంచుకున్నారు.