కరోనాపై డీజే బ్రావో కొత్త పాట.. సోషల్ మీడియాలో వైరల్..!

Saturday, March 28th, 2020, 12:30:08 AM IST

ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా వైరస్ తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. అయితే ఈ మహమ్మారి బారిన పడి వేలాది మంది చనిపోతున్న నేపధ్యంలో ప్రపంచ దేశాలన్ని తమ ప్రజలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.

అయితే కరోనా బారిన పడకుండా ఆయా దేశాల ప్రభుత్వాలు లాక్‌డౌన్ పాటిస్తూ, ప్రజలకు పలు రకాల జాగ్రతలను కూడా సూచిస్తున్నాయి. అయితే ఈ వ్యాధి బారి నుంచి తమను తాము ఎలా కాపాడుకోవాలో పలువురు ప్రముఖులు జాగ్రత్తలు తెలుపుతుంటే, మరికొందరు తమ పాటల రూపంలో జాగ్రత్తలు తెలుపుతున్నారు. అయితే తాజాగా వెస్టిండీస్ క్రికెటర్, సింగర్ డీజీ బ్రావో కూడా ఓ పాటను పాడాడు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుందని షేక్ హ్యాండ్స్ లాంటివి మానేయాలని, ఈ పోరాటంలో ఎవరూ నమ్మకాన్ని కోల్పోకూడదని అందులో తెలిపాడు. ప్రపంచమంతా ఒక్కటై కరోనాను తరిమేద్దామంటూ పాటలో వివరించాడు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.