అవును నేను ధోనీ ని దూషించా…కారణం వివరించిన బౌలర్ నెహ్రా

Sunday, April 5th, 2020, 06:28:05 PM IST


క్రికెట్ లో బౌలర్ అయినా, బ్యాట్స్మెన్ అయిన అసహనానికి గురైతే అవతలి వాళ్ళ మీద దూషణలు చేస్తారు. ఇది మనం చాలా సార్లు గమనిస్తూనే ఉన్నాం. అయితే 2005 లో ఏప్రిల్ లో పాకిస్తాన్ తో అహ్మదాబాద్ లో జరిగిన నాలుగో వన్డే మ్యాచ్ లో బౌలర్ నెహ్రా వికెట్ కీపర్ అయిన ధోనీ నీ దూషించారు. అఫ్రిది కి బౌలింగ్ వేసే సమయంలో బంతి బ్యాట్ ఎడ్జ్ కి తాకి ధోనీ, ద్రావిడ్ ల మధ్య నుండి వెళ్ళింది. అయితే అపుడు ఆగ్రహానికి గురై అసహనం వ్యక్తం చేస్తూ దూషించారు.అపుడు ధోనీ జూనియర్ అన్న విషయం తెలిసిందే, అంతేకాక ద్రావిడ్ తీరు పై కూడా అసహనం వ్యక్తం చేశారు.

అయితే ఆ ఘటన పై తాజాగా నెహ్రా స్పందించారు. తన ప్రవర్తన పట్ల ఆ తర్వాత చాలా చింతించానని వివరించారు. అయితే అది వైజాగ్ మాచ్ కాదని, అహ్మదాబాద్ లో జరిగిన నాలుగో వన్డే అని వ్యాఖ్యానించారు. అఫ్రిది బ్యాట్ కి బంతి తగిలి ధోనీ, ద్రవిడ్ మద్యలో నుండి వెళ్ళగా, నేను ధోనీ నీ దుషించ అని అన్నారు, ఆ వీడియో అప్పుడు చాలా వైరల్ అయింది అని అన్నారు. అయితే ఏదేమైనా అది నేను గర్వించ దగ్గ ప్రవర్తన కాదు అను తెలిపారు. అయితే అంతకు ముందు బంతి అఫ్రిది సిక్స్ కొట్టాడు, అందులో పాక్ తో మాచ్ అవ్వడం తో ఎక్కువగా ఒత్తిడి కి గురైనట్లు తెలిపారు. అవకాశం వచ్చి, చేజరాడంతో సహనం కోల్పోయా అని వ్యాఖ్యానించారు. అయితే మ్యాచ్ అనంతరం ధోనీ, ద్రవిడ్ లు నాతో బానే ఉన్నారు అను అన్నారు.