ధోనీ, కోహ్లీ తో పోలిస్తే దాదా టైం లోనే నా కెరీర్ బెస్ట్ గా సాగింది – యువీ

Wednesday, April 1st, 2020, 03:34:19 PM IST


సౌరవ్ గంగూలీ టీం ఇండియా కి సారధి గా ఉన్నపుడు ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఆ సమయంలో నే సౌరవ్ గంగూలీ ఎంతోమంది అత్యుత్తమ క్రికెటర్లను పరిచయం చేశారు. అంతేకాకుండా అదే సమయంలో ఎంతోమంది ఆటగాళ్లు భారత్ తరపున అత్యుత్తమం గా రాణించారు. అందులో ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఒకరు. అయితే యువరాజ్ సింగ్ తాజాగా ధోనీ, కోహ్లీ, దాదా లపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన క్రికెట్ కెరీర్ లో కెప్టెన్ సౌరవ్ గంగూలీ అందరికంటే ఎక్కువగా మద్దతు ఇచ్చారని యువీ అన్నారు. అయితే ధోనీ, కోహ్లీ లతో పోలిస్తే దాదా కెప్టెన్ గా ఉన్న సమయంలోనే తన కెరీర్ ఉత్తమం గా సాగింది అని అన్నారు.

అయితే సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ లో ఆడినపుడు దాదా నుండి ఎంతో మద్దతు లభించింది అని,
అయితే ఆ తర్వాత ధోనీ కెప్టెన్ గా కొనసాగారు. అయితే ధోనీ, దాదా లలో బెస్ట్ ఎవరంటే చెప్పడం కష్టం. కానీ దాదా మద్దతు గా నిలిచిన సమయంలోనే నా కెరీర్ లో మధురానుభూతులు నిలిచాయి అని అన్నారు. దాదా ఎంతో అండగా నిలిచారు. అయితే ధోనీ, కోహ్లీ ల నుండి ఆ మద్దతు తనకు లభించలేదని యువరాజ్ సింగ్ అన్నారు.

అయితే ఈ ఆల్ రౌండర్ శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ మరియు ఆసీస్ పేసర్ మేక్రత్ బౌలింగ్ లో ఎక్కువగా ఇబ్బంది పడ్డానని తెలిపారు. అయితే సచిన్ సలహా తో స్వీప్ షాట్లు ఆడటంతో మురళీ దరన్ బౌలింగ్ ఎదుర్కొన్న అని వ్యాఖ్యానించారు. అయితే టెస్ట్ జట్టులో ఎక్కువగా చోటు దక్కకపోవడం మెక్ గ్రాట్ నీ ఎదుర్కొనే అవకాశాలు పెద్దగా రాలేదని చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ పై యువీ ఆవేదన వ్యక్తంచేశారు. ఎంతో మందిని ఈ వైరస్ బలి తీసుకోవడం హృదయవిదారకంగా ఉంది అని అన్నారు. ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది అని, అయితే ప్రజలు భయపడకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్సైట్ లో ఈ వైరస్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలని అన్నారు.