విశాఖలో విండీస్ పై విజృంభించిన భారత్..!

Wednesday, December 18th, 2019, 05:39:38 PM IST


ప్రస్తుతం భారత్ మరియు విండీస్ మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే.ఈరోజు విశాఖ వేదికగా మూడు వన్డే మ్యాచుల సిరీస్ లో రెండో మ్యాచ్ లో ఇరు జట్లు తలపడుతున్నాయి.అయితే దీనికి ముందు మొదటి మ్యాచ్ లో విండీస్ భారత జట్టుపై ఘనమైన విజయం సాధించారు.మరి దాని ఎఫెక్టో ఏమో కానీ మనవాళ్లకు బాగా అచ్చొచ్చిన విశాఖలో ఎప్పటి లానే తమ ప్రత్యర్ధ టీమ్ కు చుక్కలు చూపించేసారు.

ఓపెనర్లగా దిగిన హిట్ మాన్ రోహిత్ మరియు కె ఎల్ రాహుల్ లు విండీస్ బౌలర్ల సహనానికి గట్టి పరీక్షే పెట్టేసారు.దాదాపు 30 ఓవర్లకు పైగా అద్భుతమైన పార్ట్నర్ షిప్ తో అదరగొట్టేసారు.వీరిలో రాహుల్ 104 బంతుల్లో 102 తో చెలరేగగా రాహుల్ కంటే వెనుకంజలో ఉన్న రోహిత్ ఎప్పటిలానే మరింత స్పీడ్ అందుకొని 138 బంతుల్లో 159 పరుగులతో కొద్దిలో డబుల్ సెంచరీను మిస్ చేసుకున్నాడు.అయితే వీరిద్దరూ అవుట్ అయ్యాక వచ్చిన రిషబ్ పంత్ మరియు శ్రేయాస్ అయ్యర్ లు అయితే విండీస్ బౌలర్లకు నిద్ర పట్టనివ్వని రేంజ్ లో చితకబాదేశారు.

అతి తక్కువ బాల్స్(16) లోనే పంత్ 39 పరుగులు చేసి హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు.కానీ శ్రేయాస్ గురి మాత్రం తప్పలేదు.32 బంతుల్లోనే 53 పరుగులు చేసి తన అర్ధ శతకాన్ని పూర్తి చేసుకొని ఈ ఇద్దరూ భారత్ స్కోర్ బోర్డుకు మరింత స్పీడ్ అందించారు.అలాగే తర్వాత వచ్చిన కేదార్ జాదవ్ కూడా మంచి ఇన్నింగ్స్ అందించి ఓవరాల్ గా 50 ఓవర్లలో 387 పరుగుల భారీ లక్ష్యాన్ని విండీస్ ముందు ఉంచారు.మరి విండీస్ ఈ లక్ష్యాన్ని ఛేదిస్తారో లేదో చూడాలి.