“రిపబ్లిక్ డే” రోజున వార్ వన్ సైడ్ చేసేసిన టీమ్ ఇండియా.!

Sunday, January 26th, 2020, 04:01:51 PM IST

ఈరోజు 71 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్కంఠభరిత పరిస్థితుల్లో కొనసాగిన మ్యాచ్ ను కైవసం చేసుకొని దేశపు త్రివర్ణ పతాకాన్ని పొరుగు దేశంలో కూడా రెపరెపలాడించారు కోహ్లీ సేన.గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న సిరీస్ మ్యాచ్ లలో వన్డే,టి 20 మరియు టెస్టులు అని తేడా లేకుండా మనవాళ్ళు ఎక్కడైనా సరే అద్భుతమైన విజయాలను సొంతం చేసుకొని వస్తున్నారు.అలా ఇప్పుడు న్యూజిలాండ్ తో జరుగుతున్న టీ 20 సిరీస్ లో వరుసగా రెండో మ్యాచ్ ను కూడా కైవసం చేసుకొని వార్ వన్ సైడ్ చేసేసారు.

ఆక్లాండ్,ఈడెన్ పార్క్ స్టేడియం వేదికగా జరిగిన ఈరోజు రెండో 20 మ్యాచ్ లో మొదటగా బ్యాటింగ్ కు దిగిన కివీస్ 20 ఓవెన్లకు కేవలం 135 పరుగులు మాత్రమే చేయగలిగారు.అయితే తక్కువ లక్ష్యం తోనే బరిలో దిగినా మన వాళ్ళు కూడా టాప్ ఆర్డర్ బ్యాట్సమెన్ లు అయిన రోహిత్ మరియు కెప్టెన్ విరాట్ కోహ్లీలను కోల్పోడానికి కూడా ఎంతో సమయం పట్టలేదు.కానీ గత మ్యాచ్ లో మ్యాజిక్ చేసిన కె ఎల్ రాహుల్(57)50 మరియు శ్రేయాస్ అయ్యర్(44)33 లు మరోసారి అదిరిపోయే ఇన్నింగ్స్ ఇచ్చే సరికి ఈ రిపబ్లిక్ డే రోజున ఓటమి పాలవ్వకుండా ప్రతిష్టను కాపాడిన వారయ్యారు.