తాగి డ్రైవ్ చేస్తూ దొరికిపోయిన క్రికెటర్!

Saturday, July 4th, 2015, 09:34:14 PM IST


ఆస్ట్రేలియన్ క్రికెటర్ జేమ్స్ ఫాల్కనర్ ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ లో పట్టుబడ్డారు. ఈ మేరకు అతన్ని ఈ కేసులో న్యాయస్థానం ముందు హాజరుపరచగా జేమ్స్ ఫాల్కనర్ కు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం ఈనెల 21న తిరిగి హాజరు కావాలని ఆదేశించింది. ఇక దీనిపై ఆస్ట్రేలియా క్రికెట్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ యువ క్రికెటర్లకు ఆదర్శంగా ఉండాల్సిన సీనియర్లు తప్పుదోవబట్టడం సరికాదని హెచ్చరించింది. అలాగే తాగి నడపడంలో ఉండే నష్టాలను గుర్తించాలని ఫాల్కనర్ కు ఆస్ట్రేలియా జట్టు పెద్దలు సూచించినట్లు సమాచారం. కాగా ఇదే డ్రంకెన్ డ్రైవ్ కేసులో షేన్ వార్న్, మైఖేల్ క్లార్క్ గతంలో పట్టుబడినట్లు వార్తలు వ్యాపించిన సంగతి తెలిసిందే.