హాట్ టాపిక్: జడేజా డేంజర్ జోన్లో ఎందుకు పరిగెత్తాడు?

Saturday, October 12th, 2019, 09:13:04 AM IST

దక్షిణాఫ్రికా తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో జడేజా డేంజర్ జోన్ లో పరిగెత్తడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో జడేజా డేంజర్ జోన్ లో పరిగెత్తడం పట్ల అంపైర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. మళ్ళి ఇది రిపీట్ అయితే అయిదు రన్స్ పెనాల్టీ విధించాల్సి ఉంటుందని అంపైర్ అన్నారు. జడేజా 91 పరుగులు చేసిన సంగతి అందరికి తెలిసిందే. సింగిల్ తీయబోయి డేంజర్ జోన్ లో పరుగులు తీసాడు జడేజా, అక్కడే నాన్ స్ట్రైక్ ఎండ్ లో విరాట్ కోహ్లీ 254 పరుగులతో అజేయంగా వున్నాడు. కోహ్లీ ఎదుటే జడేజా కి వార్నింగ్ ఇవ్వడం విశేషం.

డేంజర్ జోన్ లో పరిగెత్తడం వలన షూ ముద్రలు పిచ్ పై పడే అవకాశం వుంది. ఇలా ముద్రలు పడటం వలన స్పిన్నర్లకు పిచ్ అనుకూలిస్తుంది. టి20 ల్లో, వన్డేల్లో అంతగా ప్రయోజనం ఉండదు కానీ, టెస్ట్ మ్యాచుల్లో ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు మెండుగా వున్నాయి. బ్యాట్స్ మెన్ కూడా ఉద్దేశపూర్వకంగా పరిగెత్తే అవకాశం ఉందని విమర్శకుల వాదన, అయినా జడేజా ఇలా డేంజర్ జోన్ లో పరిగెత్తడం మొదటిసారి కాదు, 2016 లో న్యూజిలాండ్ తో ఇండోర్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఇలానే డేంజర్ జోన్ లో పరిగెత్తాడు. అయినా వినకుండా రెండోసారి పరిగెత్తడం తో, అయిదు పరుగులు పెనాల్టీ వేసి, న్యూజిలాండ్ స్కోరులో జత చేసారు అంపైర్. మరి జడేజా ఎందుకు డేంజర్ జోన్లో పరిగెత్తారో మీకేమైనా తెలుసా?