భారీ విరాళాన్ని ప్రకటించిన మొట్టమొదటి ఐపీఎల్ టీమ్ మనదే.!

Thursday, April 9th, 2020, 06:08:37 PM IST


ఇప్పుడు అన్ని బాగుండి ఉంటే మన దేశ ప్రజలు అంతా ఐపీఎల్ ఫీవర్ లో మునిగి ఉండేవారు కానీ ఇప్పుడు టైం బ్యాడ్ కాబట్టి కరోనా ఫీవర్ లో మగ్గిపోతున్నారు. అయితే ప్రపంచ దేశాలతో పాటుగా మన దేశంలోని శరవేగంగా విజృంభిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్ కలిగించిన నష్టం అంతా ఇంతా కాదు దీనితో మన దేశ ఆర్థిక వ్యవస్థ గట్టిగా దెబ్బ తినడంతో పాటు చాలా మంది ప్రజలు నిస్సహాయ స్థితిలోకి నెట్టవేయబడ్డారు.

దీనితో తమ వంతు సాయంగా అనేకమంది పెద్దలు కరోనా సహాయ నిధికి కోట్లాది రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నారు. అలా ఇప్పుడు మొట్టమొదటి సారిగా ఓ ఐపీఎల్ టీం ముందుకొచ్చి భారీ విరాళాన్ని ప్రకటించింది. అదే మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం. వీరు ఏకంగా కరోనా సహాయ నిధికి 10 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ప్రకటించినట్టు తెలుస్తుంది. ఈ మంచి పనితో మిగతా ఐపీఎల్ టీమ్స్ యాజమాన్యం కూడా ముందుకొచ్చి ఇలా విరాళాలు ప్రకటిస్తే మంచిది.