ఫ్లాష్ న్యూస్ : ధోని రిటైర్మెంట్…?

Thursday, September 12th, 2019, 07:42:39 PM IST

ఫ్లాష్ న్యూస్… టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన రిటైర్మెంట్ ప్రకటించనున్నారా…? దానికి సమాధానంగా ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నేడు ధోని కోసమని ఒక పోస్టుని షేర్ చేశారు. కాగా ఆ పోస్టు ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కాగా ధోని తన క్రికెట్ నుండి శాశ్వత రిటైర్మెంట్ తీసుకుంటానని కోహ్లీ కి చెప్పేశారని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే కోహ్లీ చేసినటువంటి ట్వీట్ కి నెటిజన్లు అందరూ రీట్వీట్ చేస్తున్నారు. కాగా ఆ ట్వీట్ #Dhoni హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్‌లో హల్చల్ సృష్టిస్తుంది కూడా… కాగా దానికి తోడు ధోని తన రిటైర్మెంట్ కోసమని నేడు ఒక ప్రెస్ మీట్ పేట్టి మరి బహిరంగంగానే ప్రకటించనున్నారని మరొక వార్త వైరల్ అవుతుంది.

కాగా ఆ వార్త చూసినటువంటి కొందరు అభిమానులు ఒకవేళ నిజంగానే ధోని గనక ఇవాళ ఏటైర్మెంట్ ప్రకటిస్తే మాత్రం ఇవాళ క్రికెట్‌కు బ్లాక్ డే అని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తలన్నీ చూసినటువంటి ధోని భార్య అవన్నీ కూడా వట్టి పుకార్లే అని కొట్టిపారేశారు. ఇకపోతే నేడు బీసీసీఐ సెలక్షన్ కమిటి సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు తాజా టీంను సెలెక్ట్ చేసింది కూడా. ఇకపోతే ధోని రిటర్మెంట్ వార్తని వారి ముందు ప్రస్తావించగా, ఆ వార్త చాలా అబద్దమని, అలంటి పుకార్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని చెప్పేశారు.