వైరల్ అవుతున్న రనౌట్.. ఇదేందయ్య ఇది నేనేప్పుడు చూడలా..!

Tuesday, March 10th, 2020, 12:26:56 AM IST

క్రికెట్ ఆటలో బ్యాట్స్‌మెన్స్ రనౌట్స్ అవుతుండడం సర్వసాధారణం. ఇద్దరి ఆటగాళ్ళ మధ్య తడబాటు కనిపించినా, రన్ కోసం పరుగెత్తుతున్నప్పుడు మార్గమధ్యంలో బ్యాట్స్‌మెన్ కింద పడిపోయినా రనౌట్ అవ్వడం ఖాయం. అయితే కొన్ని సార్లు బౌలర్ బంతిని వేసిన వెంటనే బ్యాట్స్‌మెన్ క్రీజ్ వదలడం ఆ బంతిని స్ట్రైక్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ నేరుగా వికెట్లు వైపు కొట్టినప్పుడు అది కాస్త బౌలర్ చేతి తాకి అవుట్ అవ్వడం, కొన్నిసార్లు ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ ఒకే వైపు పరుగెత్తడం వంటి రనౌట్లు నిత్యం చూస్తూనే ఉంటాం.

అయితే ‘ఫాక్స్ క్రికెట్’ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో చూస్తే మాత్రం నవ్వు ఆపుకోలేరు. బౌలర్ స్ట్రైకర్‌కు బంతి వేయగానే అది బ్యాట్స్‌మెన్ కాలికి తగిలి క్రీజు వద్దే గింగిరాలు తిరిగింది. అయితే రన్ వస్తుందేమో అనుకున్న నాన్‌స్ట్రైకర్ దాదాపు స్ట్రైకర్ క్రీజ్ దగ్గర వరకు పరుగెత్తాడు. అయితే ఇదంతా గమనించని స్ట్రైకర్ ఆ బంతిని తీసి సింపుల్‌గా బౌలర్ చేతికి విసిరాడు. ఇంకేముంది దొరికిందే అవకాశం అన్నట్టుగా బౌలర్ బంతితో సింపుల్‌గా నాన్ స్ట్రైకర్‌ను రనౌట్ చేశాడు. ఆ సమయంలో స్ట్రైకర్, నాన్ స్ట్రైకర్ ముఖాలు చూస్తే మాత్రం నవ్వుకోకుండా ఉండలేరు. అయితే ఇది నిజంగా జరిగిందో, కావాలనే టిక్‌టాక్‌లో చేసిందో తెలియదు కానీ, రనౌట్ ఫన్నీగా ఉండడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.