ధోని పై సంచలన వ్యాఖ్యలు చేసిన గంభీర్…సచిన్ అందుకే ఇలా!

Monday, November 18th, 2019, 02:21:29 PM IST

టీమ్ ఇండియా లో విధ్వంసకర బ్యాట్సమెన్ లలో గంభీర్ ఒకడు. 2011 వరల్డ్ కప్ ఫైనల్ లో గంభీర్ ఆటతీరు అద్భుతం అని చెప్పాలి. సచిన్, సెహ్వాగ్ లు ఔటైనప్పటికీ నిలకడగా రాణించి టీం ఇండియా కి గెలుపుని అందించడమే కాకుండా వరల్డ్ కప్ గెలవడానికి కీలక పాత్రని పోషించారు. అయితే ప్రస్తుతం గంభీర్ ధోని పై చేసిన కామెంట్స్ దేశ క్రికెట్ అభిమానుల్లో అలజడి రేగుతున్నాయి. అవేంటో ఇపుడు చూద్దాం.

అయితే సచిన్ 90 పరుగులు చేసి చాల సార్లు అవుట్ అయ్యాడు. దానికి గల కారణాన్ని ఇలా తెలిపాడు గంభీర్. బ్యాట్సమెన్ కి అవతలి ఎండ్ లో వున్న క్రికెటర్ 100 పరుగుల గురించి తెలియజేయడం తో దాని పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని తెలపడం జరిగింది. అయితే 2011 లో జరిగిన ప్రపంచ కప్ లో ధోని తన 100 పరుగుల గురించి తెలియజేయడం తో ఒత్తిడి పెరిగి చేయలేకపోయానని తెలిపారు. 97 పరుగులు చేరుకున్నాక, ధోని మిగిలిన మూడు పరుగుల్ని చిన్నగా ఆడు అన్నట్లుగా తెలపడం తో చివరికి అవుట్ అయ్యానని తెలిపారు. అయితే దీనిని బ్లేమ్ గేమ్ అని గంభీర్ ట్యాగ్ లో పేర్కొనడం గమనార్హం. దానికి ధోని, అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.