బిగ్ న్యూస్: సముద్రంలో నిశ్చితార్థం చేసుకున్న టీం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య!

Wednesday, January 1st, 2020, 07:51:00 PM IST

భారత ఆల్ రౌండర్ గా చాల తక్కువ కాలంలోనే పేరు తెచ్చుకున్న హార్దిక్ పాండ్య ఒక ఇంటివాడు కాబోతున్నాడు. నటి నటాషా స్టాన్కోవిచ్ తో ప్రేమ లో వున్నట్లుగా పుకార్లు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటివరకు ఈ విషయం ఫై నోరు విప్పని హార్దిక్ పాండ్య నూతన సంవత్సరం సందర్భంగా తాను ప్రేమలో ఉన్నట్లు తెలుపడం మాత్రమే కాకుండా, నిశ్చితార్థం చేసుకున్నారు. నేను నీ వాడని, నువ్వు నా దానివి, మొత్తం భారతదేశానికి ఈ విషయం తెలుసు అంటూ వ్యాఖ్యానించారు.

అయితే ఇప్పటివరకు హార్దిక్ పాండ్య పీకల్లోతు ప్రేమలో వున్నాడని స్నేహితులు, సన్నిహితులకు మాత్రమే తెలుసు. ఇపుడు సోషల్ మీడియా లో తెలపడం తో హార్దిక్ పాండ్య చేసిన పోస్ట్ కొద్దీ నిమిషాల్లోనే వైరల్ గా మారింది. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్య, నటాషాకు శుభాకాంక్షలు తెలిపారు. వెన్ను గాయం కారణం గా గత సెప్టెంబర్ నుండి క్రికెట్ కి దూరంగా వుంటున్నారు. అయితే ఇటలీలో సర్జెరీ చేయించిన అనంతరం, ఫిట్నెస్ ఫై దృష్టి పెట్టి ముంబాయి టీం తరపున రంజీ మ్యాచుల్లో రాణిస్తున్నాడు. ఈ జనవరి ఆఖరిలో న్యూజిలాండ్ పర్యటనకి భారత్ జట్టు వెళ్తున్న సంగతి తెలిసిందే, ఆ జట్టులో చోటు పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు.