సన్‌రైజర్స్ జట్టులో చోటు దక్కించుకున్న హైదరాబాద్ కుర్రాడు..!

Friday, December 20th, 2019, 01:21:12 AM IST

ఐపీఎల్ 2020కి గాను కోల్‌కత్తాలో నేడు ఆటగాళ్ళ వేలం జరిగింది. అయితే ఈ ఐపీఎల్ వేలంలో హైదరబాద్ కుర్రాడికి సన్ రైజర్స్ జట్టులో చోటు దక్కింది. ముషీరాబాద్‌లోని రాంనగర్‌కి చెందిన బవనక పరమేశ్వర్ సందీప్‌ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది.

అయితే ప్రస్తుతం సందీప్ వయసు 28 ఏళ్ళు కాగా, ఎడమ చేతి బ్యాటింగ్ చేయడం అతగాడి స్పెషాలిటీ. అయితే ఎన్నో ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడిన సందీప్ తన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకట్టుకోవడంతో సన్‌రైజర్స్ యాజమాన్యం అతడిని జట్టులోకి తీసుకుంది. అయితే ఐపీఎల్‌కి ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సందీప్, హైదరాబాద్ జట్టు తరుపున ఆడటానికి తాను వేచి చూస్తున్నానని ఈ అవకాశం కల్పించిన జట్టు యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్పాడు. ఇకపోతే సందీప్ ఐపీఎల్‌కి ఎంపిక కావడంతో క్రికెట్ అభిమానులు, బంధువులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.