5వ టీ 20 విషయమై ఐసీసీ కీలక నిర్ణయం – షాక్ లో టీమిండియా…

Monday, February 3rd, 2020, 05:30:05 PM IST

కివీస్‌ తో జరిగినటువంటి ఐదు మ్యాచ్‌ ల టీ20 సిరీస్‌ను టీమిండియా జట్టు క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి మనకు తెలిసిందే. కానీ అలంటి టీమిండియా జట్టు కి తాజాగా భారీ షాక్ తగిలిందని చెప్పాలి. కాగ్ చివరి టీ20 లో భాగంగా స్లోఓవర్‌ రేట్‌ విషయమై ఐసీసీ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుందని సమాచారం. కాగా చివరి ఆటకి గాను ఆటగాళ్ల ఫీజులో దాదాపుగా 20 శాతం జరిమానా విధించిందని ఐసీసీ ఒక అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది. కాగా ఈమేరకు మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ మాట్లాడుతూ… “ఐసీసీ ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా, ప్రతీ ఓవర్ కూడా నిర్ణీత సమయంలో పూర్తి కావాల్సి ఉంటుంది. అలా జరగని పక్షంలో ఆటగాళ్ల ఫీజులో కొంత జరిమానా ఉంటుందని, అందుకనే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది” అని వాఖ్యానించారు.

ఇకపోతే టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ ఈ స్లో ఓవర్ రేట్ ని అంగీకరించిన నేపథ్యంలో తమ తదుపరి వాదనలు ఇక ఉండబోవని వెల్లడించారు. ఇకపోతే ఇటీవల జరిగినటువంటి వెస్ట్‌ప్యాక్‌ స్టేడియంలోని నాలుగవ ఆటలో కూడా టీమిండియా జట్టు రెండు ఓవర్లు ఆలస్యంగా మ్యాచ్‌ను ముగించిందని, అందుకనే టీమిండియా ఆటగాళ్ల ఫీజులో 40 శాతం జరిమానా ఉండనుందని వెల్లడించారు. ఆటలో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా జట్టుకి ఇదొక చేదు వార్తే అని చెప్పాలి.