టెస్ట్‌ల్లో స్మిత్ మళ్ళీ నంబర్ వన్.. కోహ్లీకి దక్కని ఛాన్స్..!

Monday, September 16th, 2019, 07:49:47 PM IST

ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో మళ్ళీ నంబర్‌వన్ స్థానాన్ని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ కైవసం చేసుకున్నారు. అయితే యాషెస్ టెస్ట్ సిరిస్ ముగిసిన సందర్భంగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. అయితే యాషెస్ సిరిస్‌లో తన బ్యాంటింగ్‌తో కదం తొక్కిన స్మిత్ పరుగుల వరద పారించాడు. కేవలం నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలోనే 774 పరుగులు చేసి మరో సారి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

అయితే ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ జాబితా ప్రకారం 937 పాయింట్లతో స్మిత్ అగ్రస్థానంలో నిలవగా, 903 పాయింట్లతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. అయితే యాషెష్ టెస్ట్‌కి ముందు స్మిత్ 857 పాయింట్లతో నాల్గవ స్థానంలో ఉండగా అప్పుడు కోహ్లీనే ముందంజలో ఉన్నాడు. అయితే యాషెస్ సిరీస్‌లో స్మిత్ అధ్బుత ప్రదర్శనతో ఏకంగా నంబర్ వన్ ప్లేస్‌లోకి దూసుకొచ్చాడు. ఇకపోతే బౌలింగ్‌లో ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ 908 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుండగా, సౌతాఫ్రికా బౌలర్ రబాడ 851 పాయింట్లతో రెండవ స్థానంలో, భారత బౌలర్ బుమ్రా 835 పాయింట్లతో మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు.