ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుని మంచి ఊపు మీద ఉన్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియా, ఇంగ్లండ్ మధ్య చెన్నై చెపాక్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలయ్యింది. అయితే ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ నెగ్గిన తర్వాత టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచిన భారత్ ఈ మ్యాచ్‌లో ఓటమి ద్వారా పాయింట్ల పట్టికలో కిందకు పడిపోయింది.
అయితే ఏకంగా మొదటి స్థానం నుంచి నాలుగో స్థానానికి భారత్ పడిపోయింది. అయితే తొలి టెస్ట్ గెలుపుతో ఇంగ్లండ్ టాప్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్ళింది. చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆరో సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్ మొత్తం 11 విజయాలు, 4 ఓటములు, 3 డ్రాలతో మొత్తం 70.2 శాతం పాయింట్లతో అగ్ర స్థానంలో ఉండగా, భారత్ మొత్తం 9 విజయాలు, 4 ఓటములు, ఒకటి డ్రా చేసుకుని 68.3 శాతం పర్సెంటేజీ పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానంలో న్యూజిలాండ్, మూడో స్థానంలో ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి.