భారత్ వర్సెస్ బంగ్లా : చాహర్ మ్యాజిక్ తో సిరీస్ కైవసం!

Sunday, November 10th, 2019, 11:26:24 PM IST

భారత్ కు పాకిస్థాన్ చిరకాల ప్రత్యర్థి అనుకుంటాం కానీ ఆ స్థానాన్ని బంగ్లాదేశ్ జట్టు వారు రిప్లేస్ చేసుకున్నారు.మన జట్టు మీద ఆడి ఒక్క వికెట్ తీస్తే చాలు ఏదో ప్రపంచ కప్ కొట్టినట్టుగా విర్రవీగిపోయి మన వాళ్ళ మీద ఒక రేంజ్ లో విరగబడతారు.అలా వారు మన మీద ఎక్కువ చెయ్యడం మన వాళ్ళు నడ్డి విరగ్గొట్టడం చాలా సార్లు జరిగాయి.అయితే ప్రస్తుతం జరిగిన టీ20 సిరీస్ లో మొదటి మ్యాచ్ లోనే వారు గెలవడంతో ఇక వారిని ఎవరు ఆపలేకపోయారు.కానీ రోహిత్ సేన మళ్ళీ నడ్డి విరగొట్టింది.

రెండో మ్యాచ్ లో రోహిత్ శర్మ విరుచుకుపడి వారి మీద రివెంజ్ తీర్చుకున్నారు.అయితే దానికి దెబ్బగా ఈరోజు జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ ను ఆదిలోనే పెవిలియన్ కు పంపి సంబరాలు చేసుకొన్నారు.కానీ కె ఎల్ రాహుల్ మరియు శ్రేయాస్ అయ్యర్ లు చెరో అర్ధ శతకంతో బంగ్లా బౌలర్లను బాదేశారు.

అలా వారికి నిర్ణీత ఓవర్లలో 175 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వగా దీపక్ చాహర్ చేసిన మ్యాజిక్ తో బంగ్లా బ్యాట్స్ మెన్లు చేతులెత్తేశారు.ఏకంగా 10 వికెట్లతో 6 వికెట్లు పడగొట్టి 144 ఓవర్లకే బంగ్లాను చిత్తు చిత్తు చేసేసారు.సరిగ్గా పీక్ ఓవర్లలలో చాహల్ మరియు కొత్త బౌలర్ శివమ్ దుబే మంచి బ్యాకప్ ఇచ్చారు.కానీ చాహర్ మాత్రం కేవలం 3.2 ఓవర్లలలో 7 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి నిజంగానే మ్యాజిక్ చేసి భారత జట్టుకు విజయాన్ని అందించాడు.