IND vs WI వన్డే : శతకాలతో అదరగొట్టిన ఇద్దరు భారత ఓపెనర్లు…

Wednesday, December 18th, 2019, 05:10:01 PM IST

నేడు విశాఖ వేదికగా భారత్ మరియు వెస్టిండీస్ మధ్యన జరుగుతున్నటువంటి మొదటి వన్డే లో భారత ఆటగాళ్లు విజృంబిస్తున్నారు. కాగా ఆట ప్రారంభంలో ఓపెనర్లుగా క్రీజులోకి దిగినటువంటి రోహిత్ శర్మ మరియు కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా శతకాలతో అదరగొట్టారు… ఇప్పటికే రోహిత్ 107 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 100 పరుగులు పూర్తిచేయగా, కేఎల్ రాహుల్ 102 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులతో 101 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. సెంచరీ పూర్తైన కాసేపటికే రాహుల్ (102) జోసెఫ్ బౌలింగ్‌లో చేజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ దారుణంగా తోలి బంతికే అవుట్ అయ్యాడు.

ఆ తరువాత కేఎల్ రాహుల్ కూడా అల్జారీ జోసెఫ్ బౌలింగ్ లో రోస్టన్ చేస్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. కాగా కేఎల్ రాహుల్ 104 బంతుల్లో 12 పరుగులు సాధించారు. కాగా ప్రస్తుతానికి శ్రేయాస్ అయ్యర్ మరియు రిషబ్ పంత్ ఇద్దరు కూడా క్రీజులో దూకుడుగా ఆడుతున్నారు.