చెన్నై వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. నాలుగో రోజు భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో కేవలం 178 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు విలవిల్లాడిన ఇంగ్లండ్ వరుసగా వికెట్లను కోల్పోయింది. అశ్విన్ 6 వికెట్లు తీసుకోగా, నదీమ్ 2, ఇషాంత్, బుమ్రా చెరో వికెట్ దక్కించుకున్నారు. అయితే తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్కు 241 పరుగుల ఆధిక్యం లభించడంతో టీమిండియాకు ముందు 420 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
అయితే రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 12 పరుగులు మాత్రమే చేసిన ఓపెనర్ రోహిత్ శర్మ జాక్ లీచ్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో శుభ్మన్ గిల్ 15 పరుగులు, చాటేశ్వర్ పుజారా 12 పరుగులు ఉన్నారు. అయితే ఆఖరి రోజు భారత జట్టు విజయానికి ఇంకా 381 పరుగులు అవసరం కాగా, చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో మాదిరి భారత్ మరోసారి చరిత్ర ఏమైనా సృష్టిస్తుందో లేదో వేచి చూడాలి మరీ.