India vs Australia : తడబడ్డ భారత మహిళా జట్టు – ఫైనల్స్ లో ఆసీస్ ఘనవిజయం

Sunday, March 8th, 2020, 03:47:57 PM IST

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ లో విభాగంగా నేడు ఆస్ట్రేలియా మరియు భారత జట్లు భయంకరమైన పోరాటానికి సై అన్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఇంతటి భయంకరమైన ఈ పోరులో భారత మహిళా జట్ల ఆటగాళ్లు చివరికి చేతులెత్తేశారు… వివరాల్లోకి వెళ్తే నేడు మెల్బోర్న్ లో జరిగిన భారత మరియు ఆస్ట్రేలియా హాజట్ల ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా టార్గెట్ ఛేదనలో తడబడింది. వారి బ్యాటింగ్ అనేది తీవ్రమైన నిరాశకు గురి చేసింది. అయితే ముందుగా బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా నిర్దేశించిన 185 భారీ పరుగుల లక్ష్యాన్ని టీమిండిన మహిళా జట్టు చేరుకోలేకపోయింది.

టీమిండియా బ్యాటింగ్ కి దిగిన కొద్దిసేపట్లోనే 34 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి పేలవ ప్రదర్శనను చూపించింది. ఇకపోతే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జొనసేన్ బౌలింగ్‌లో గార్డ్నర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్ అయ్యాడు… తరువాత ఓపెనర్లు స్మృతి మందన(11), షఫాలీ వర్మ(2) కొద్ది పరుగులకే చేతులెత్తేశారు. రోడ్రిగ్యూస్ ఒక్క పరుగు కూడా చేయకుండానే జొనసేన్ బౌలింగ్‌లో నికోలా క్యారీకి క్యాచ్‌గా చిక్కి పెవిలియన్‌ బాట పట్టింది.