టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంటుందా?

Sunday, January 19th, 2020, 06:23:08 PM IST

ఆస్ట్రేలియా తో తలపడుతున్న మూడో వన్డే మ్యాచ్ చాల రసవత్తరంగా సాగనుంది. భారత్ కు 287 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఈ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ సెంచరీతో ఆస్ట్రేలియా కు మంచి స్కోర్ సాధించి పెట్టాడు. స్మిత్ కి తోడుగా లబు షేన్ మరియు అలెక్స్ క్యారీ లు మంచి భాగస్వామ్యాన్ని అందించారు. ఆఖరిలో ఆసీస్ దూకుడుకు భారత్ బౌలర్లు అడ్డుకోవడంతో మూడు వందల స్కోర్ కాకుండా ఆపగలిగారు. ఒక్క మహమ్మద్ షమీ నాలుగు వికెట్లు తీయగా, జడేజా రెండు వికెట్లు తీసి ఆసీస్ ని కట్టడి చేసారు.

అయితే ఇప్పటివరకు ఈ సిరీస్ 1-1 తో సమంగా వున్నారు. సిరీస్ విన్నర్ ని డిసైడ్ చేసే మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ గాయాల బారిన పడ్డాడు. గాయం కారణంగా శిఖర్ ధావన్ బ్యాటింగ్ కి దిగడం కష్టమని అనిపిస్తుంది. టీమిండియా దూకుడుగా బౌలింగ్ చేయడం తో స్మిత్ తెలివిగా మంచి బాగస్వామ్యాలతో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగాడు. అయితే ఈ మ్యాచ్ లో స్మిత్ దూకుడు కు షమీ బ్రేకులు వేసి ఆ తర్వాత వరుస వికెట్లని పడగొట్టాడు.నిర్ణిత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఆసీస్ 286 పరుగులు సాధించింది.