India vs Australia : భారత మహిళా జట్టుకి భారీ టార్గెట్ ఇచ్చిన ఆస్ట్రేలియా మహిళా జట్టు…

Sunday, March 8th, 2020, 02:00:51 PM IST

భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ 20 ప్రపంచ కప్ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే… కాగా ఈ మ్యాచ్ లో భారత మహిళా జట్టు ముందు ఆస్ట్రేలియా మహిళా జట్టు భారీ స్కోర్ ఉంచింది. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లోని ఆస్ట్రేలియా జట్టులో ఏజే హేలీ (75), బీఎల్ మూనీ (78) పరుగులు చేయడంతో ఆసీస్ జట్టు భారీ స్కోర్ వైపు సాగింది. భారత బౌలర్లలో డీబీ శర్మ నాలుగు ఓవర్లు వేసి 2 వికెట్లు తీసింది. పూనమ్ యాదవ్ 1, ఆర్పీ యాదవ్ 1 వికెట్లు తీశారు.

ఓపెనర్ అలీసా హీలీ ( 39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 75) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, బెత్ మూనీ ( 54 బంతుల్లో 10 ఫోర్లతో 78 నాటౌట్) కూడా దంచికొట్టింది. కెప్టెన్ మెగ్ లానింగ్ 15 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 16 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్ ఒక్కో వికెట్‌ తీశారు.