INDIA vs PAKISTAN : అదరగొడుతున్న యువ టీమిండియా ఆటగాళ్లు…

Tuesday, February 4th, 2020, 07:03:44 PM IST

సౌతాఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రమ్ వేదికగా జరుగుతున్నటువంటి అండర్‌-19 వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఇప్పటివరకైతే భారత్‌ యువ ఆటగాళ్లు మాత్రం ఇరగదీస్తున్నారనే చెప్పాలి. పాక్‌ పేసర్ల బౌలింగ్‌లో భారత ఓపెనర్లు యశస్వి జైశ్వాల్‌(27), దివ్యాంన్షు సక్సేనా(25) చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఇకపోతే ఆమీర్‌ ఖాన్‌ తన బౌలింగ్ తో బ్యాట్స్‌మెన్‌ కి చుక్కలు చూపిస్తున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి. అయితే ఇలాంటి తరుణంలో భారత ఓపెనింగ్‌ జోడీ నిలకడైన ఆటను ప్రదర్శిస్తూ, తమ వికెట్ పోకుండా చాలా జాగ్రత్త పడుతుంది.

ఇకపోతే పాకిస్థాన్ నిర్దేశించిన 173 పరుగుల టార్గెట్ ను యువఇండియా జట్టు నిలకడగా ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి పాకిస్థాన్ జట్టు కేవలం 172 పరుగులకే ఆలౌటైంది. కాగా ఈ అండర్ 19 టీమిండియా బౌలర్లలో సుషాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగీ, రవి బిష్ణోయ్ వరుసగా వికెట్లు తీయడంతో పాకిస్థాన్ స్వల్ప స్కోరుకే ఆలౌటైంది.