దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ టీం ఇండియా జట్టు ఇదే..అతడికి మొండిచెయ్యి

Friday, August 30th, 2019, 09:15:42 AM IST

టీం ఇండియా వెస్టిండీస్ సిరీస్ తర్వాత దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇందులో భాగంగా టీ20 సిరీస్‌ జరుగనుంది. సెప్టెంబరు 15, 18, 22 తేదీల్లో ట్వంటీ-ట్వంటీ మ్యాచ్ లు జరుగనున్నాయి . ఇందుకోసం 15 మంది సభ్యులను ఎంపిక చేయటం జరిగింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆటగాళ్లను ఎంపిక చేశారు. ముఖ్యంగా రిషబ్ పంత్ కి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ధోనిని పక్కన పెట్టి మరి అతడికి ఛాన్స్ ఇవ్వటం జరిగింది.

ఇక వెస్టిండీస్ టూర్ కి దూరంగా ఉన్న హార్దిక్ పాండ్య ని ఈ సిరీస్ కి ఎంపిక చేయటం జరిగింది. బౌలర్లు జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌కు టీ20 సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చారు. వాళ్ళ స్థానంలో ఖలీల్‌ అహ్మద్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్‌ సైని పేస్‌ బౌలింగ్‌ బాధ్యతలు అప్పగించారు సెలెక్టర్లు.

టీమిండియా జట్టు ఇదే..
విరాట్ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), హర్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, కృనాల్‌ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌, దీపక్ చాహర్‌, నవదీప్‌ సైని.