చిత్తుగా ఓడిన విండీస్ – సిరీస్ గెలిచిన భారత్…

Wednesday, December 11th, 2019, 11:26:42 PM IST

నేడు వెస్టిండీస్ మరియు భారత్ ల మధ్య జరిగిన చివరి టీ 20 లో భారత్ అఖండమైన విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా వాంఖెడే మైదానంలో జరిగిన చివరి టీ 20 మ్యాచ్‌లో 67 పరుగులతో టీమిండియా జట్టు విజయాన్ని నమోదు చేసుకుందని చెప్పాలి. కాగా 241 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ ఆటగాళ్లు అతి తక్కువ సమయంలోనే 3 వికెట్లు చేజార్చుకున్నారు. ఆతరువాత కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ (68: 39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు), హిట్‌మైర్‌(41: 24 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్సర్లు) బాగా ఆడినప్పటికీ కూడా భారత్ ఆటగాళ్ళని బయపెట్టలేకపోయారు.

ఇకపోతే భారత బౌలర్లలో దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌, షమీ, కుల్దీప్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇకపోతే మన బాట్ మేన్స్ అందరు కూడా ఆరంభం నుండే అదరగొట్టాడు. కాగా ఈ మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను 2-1తో భారత్ దక్కించుకుంది.