వరల్డ్ కప్ 2019 : ఘనవిజయాన్ని నమోదు చేసుకున్న టీమిండియా

Wednesday, June 5th, 2019, 11:50:36 PM IST

ప్రపంచ కప్ లో టీం ఇండియా తొలి ఆటతోనే విజయాన్ని నమోదు చేసుకుంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తనదైన దూకుడు ఆటని ప్రదర్శించి అద్భుత శతకంతో చెలరేగిపోయాడు. రోహిత్‌ శర్మ(122నాటౌట్‌; 144బంతుల్లో 13×4, 2×6) శతకంతో టీం ఇండియా భరోసా సంపాదించుకుంది. ముందుగా బౌలర్లు చాహాల్‌(4/51), బుమ్రా(2/35), భువనేశ్వర్‌(2/44) అద్భుతమైన ప్రదర్శనను కనబరిచి, దక్షిణాఫ్రికాను నిర్ణీత 50ఓవర్లలో 227పరుగులకే కట్డడి చేశారు. ఆ తరువాత బ్యాటింగ్ కి దిగిన భారత్‌ లక్ష్యాన్ని 47.3 ఓవర్లలోనే పూర్తి చేసి ఆరు వికెట్ల తేడాతో ఘానా విజయాన్ని నమోదు చేసుకుంది.

229 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు క్రిస్‌ మోరిస్‌, రబాడ లాంటి బౌన్సర్లతో ఎదురు దెబ్బ తగిలింది. ముందుగా ధావన్‌(8) తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. కోహ్లీ(18; 34బంతుల్లో 1×4) కూడా త్వరగానే వెనుతిరిగారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన కేఎల్‌ రాహుల్‌(26; 42బంతుల్లో 2×4)తో కలిసి, రోహిత్‌ నిదానంగా ఇన్నింగ్‌ను విజయ పథం వైపు నడిపించాడు. రోహిత్ వీరోచితంగా ఆటని ప్రదర్శించి శతకాన్ని నమోదు చేసుకున్నాడు. రాహుల్‌ ఔటయ్యాక వచ్చినటువంటి ధోనీ(34; 46బంతుల్లో 2×4) కూడా రోహిత్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. చివర్లో హార్ధిక్‌ పాండ్య(15; 7బంతుల్లో 3×4) అందరు కలిసి మ్యాచ్ గెలిపించారు.