బిగ్ న్యూస్: 2-1 తో సిరీస్ కైవసం చేసుకున్న టీం ఇండియా!

Sunday, January 19th, 2020, 09:48:19 PM IST

ఆస్ట్రేలియా తో తలపడిన టీమిండియా, మూడో వన్డే మ్యాచ్ చాల రసవత్తరంగా ముగించింది. భారత్ కు 287 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఈ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ సెంచరీతో ఆస్ట్రేలియా కు మంచి స్కోర్ సాధించి పెట్టాడు. స్మిత్ కి తోడుగా లబు షేన్ మరియు అలెక్స్ క్యారీ లు మంచి భాగస్వామ్యాన్ని అందించారు. ఆఖరిలో ఆసీస్ దూకుడుకు భారత్ బౌలర్లు అడ్డుకోవడంతో మూడు వందల స్కోర్ కాకుండా ఆపగలిగారు. ఒక్క మహమ్మద్ షమీ నాలుగు వికెట్లు తీయగా, జడేజా రెండు వికెట్లు తీసి ఆసీస్ ని కట్టడి చేసారు.

అయితే రెండో వన్డేతో ఈ సిరీస్ 1-1 తో సమంగా వున్నారు. సిరీస్ విన్నర్ ని డిసైడ్ చేసే మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ గాయాల బారిన పడ్డాడు. గాయం కారణంగా శిఖర్ ధావన్ బ్యాటింగ్ కి దిగడం కష్టమని అనిపిస్తుంది. టీమిండియా దూకుడుగా బౌలింగ్ చేయడం తో స్మిత్ తెలివిగా మంచి బాగస్వామ్యాలతో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగాడు. అయితే ఈ మ్యాచ్ లో స్మిత్ దూకుడు కు షమీ బ్రేకులు వేసి ఆ తర్వాత వరుస వికెట్లని పడగొట్టాడు.నిర్ణిత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఆసీస్ 286 పరుగులు సాధించింది.

287 పరుగుల లక్ష్యం తో బరిలో దిగిన భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్ ని 2-1 తేడాతో కైవసం చేసుకొని మరొకసారి విరాట్ కోహ్లీ సారథ్యంలో సంచలనం సృష్టించింది. అయితే గతేడాది జరిగిన సిరీస్ ఓటమికి ఇపుడు టీమిండియా ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది. ఆసీస్ నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి 47. 3 ఓవర్లలో ఛేదించింది. రోహిత్ శర్మ (119) సెంచరీ తో కదం తొక్కగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ (89) అర్ద శతకాన్ని బాదాడు. సమిష్టి కృషి తో టీమిండియా మరో అమూల్యమైన సిరీస్ ని తన ఖాతాలో వేసుకుంది.