అద్భుతమైన ఇన్నింగ్స్ తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్!

Sunday, December 22nd, 2019, 11:15:38 PM IST

గత కొన్ని రోజుల నుంచి భారత్ మరియు విండీస్ ల మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే.మొత్తం మూడు మ్యాచుల సిరీస్ గా మొదలైన ఈ ఒన్డే సిరీస్ చెరొక జట్టు విజయంతో ఈరోజు జరగబోయే మ్యాచ్ వరకు ఉత్కంఠగా మారింది.అలా ఎన్నో అంచనాల మధ్య మొదలైన ఈ మ్యాచ్ కు వేదికగా కటక్ బరబాటి స్టేడియం మారింది.అయితే టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న భారత్ టీమ్ పై విండీస్ 315 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు.

అయితే తర్వాత బాటింగ్ కు దిగిన ఓపెనర్లు రోహిత్ శర్మ మరియు రాహుల్ లు మరో సారి ఒక్కసారిగా స్టాండర్డ్ బాటింగ్ తో రెండో ఒన్డే ను తలపించి విండీస్ కు చెమటలు పట్టించారు.అర్ధ శతకాలను పూర్తి చేసుకున్న ఈ ఇద్దరు అవుట్ అయ్యాక సారధి కోహ్లీ వచ్చి విజయానికి మరింత చేరువగా తీసుకెళ్లారు.

అయితే మొన్న చెలరేగిన శ్రేయాస్ ను మరియు పంత్ ను విండీస్ కట్టడి చేసెయ్యడం అలాగే 85 పరుగులకు అవుట్ చేసిన తర్వాత మ్యాచ్ చేజారుతుందా అని అనుకున్నప్పుడు జడేజా మరియు శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో విండీస్ చేతుల్లో మ్యాచ్ ను లాగేసుకున్నారు.మెరుపు ఇన్నింగ్స్ తో ఇద్దరూ నాటౌట్ గా నిలిచి ఇంకో 8 బాల్స్ ఉండగానే భారత జట్టుకు విజయాన్ని సొంతం చేసి సిరీస్ ను కూడా అందించిన వారయ్యారు.ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ ఇన్నింగ్స్ అయితే మెయిన్ హైలైట్ అని ప్రతి ఒక్కరు పొగుడుతున్నారు.