అర్జున అవార్డుకు నామినేట్ అయిన భారత క్రికెటర్

Saturday, August 17th, 2019, 08:57:08 PM IST

మన భారత క్రికెటర్, అల్ రౌండర్ రవీంద్ర జడేజా అర్జున అబార్డుకు నామినేట్ అయ్యారు. కాగా జడేజా, పూనమ్ యాదవ్ తో పాటే మరో 19 మంది ఆ అర్జున అవార్డులకు నామినేట్ అయ్యారు. కాగా ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా జరిగినటువంటి ప్రపంచకప్ 2019 సీజన్లో భాగమైన సెమి ఫైనల్ మ్యాచులో 59 బంతుల్లో 79 పరుగులను సాధించి ఫైనల్ కి చేరతామనే ఆశని బలంగా కల్పించాడు రవీంద్ర జడేజా… అంతేకాకుండా టెస్టు మ్యాచుల్లో కూడా ఫీల్డింగ్ విభాగాల్లో టాప్ వరసలో నిలిచాడు రవీంద్ర జడేజా… కాగా బీసీసీఐ అర్జున అవార్డుకు మొహమ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, మహిళా జట్టు లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్‌లను రికమెండ్ చేసింది. అయితే క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుని ప్రదానం చేస్తుంది. కాగా గత 2018 సంవత్సరంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును అందుకున్న మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మాత్రమే.

కాగా రెజ్లింగ్‌లో భజరంగ్ పూనియా, దీపా మాలిక్‌లు ఈ ఏడాదికి గాను రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును అందుకోనున్నారు. అంతేకాకుండా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రెజ్లింగ్ విభాగం లో పూనియా, వినేశ్ ఫోగట్‌ను అవార్డుకు రికమెండ్ చేసింది.వీరితో పాటే ట్రాక్ అండ్ ఫీల్డ్ స్టార్స్ తేజిందర్ పాల్ సింగ్ టూర్, మొహమ్మద్ అనాస్, స్వప్న బర్మాన్, ఫుట్‌బాలర్ గురుప్రీత్ సింగ్ సంధు, హాకీ ప్లేయర్ చింగ్‌లెన్సన సింగ్ కంగుజమ్, షూటర్ అంజుమ్ మోడ్గిల్‌లు ఉన్నారు.