IPL 2020 : ప్రారంభమైన ఐపీఎల్‌ వేలం…

Saturday, December 14th, 2019, 02:00:16 AM IST

ఐపీఎల్ 2020 సీజన్ కోసమని తాజా వేలం పాటలో 332 మంది ఆటగాళ్లతో కూడిన చివరి జాబితాని బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. కాగా ఈ సీజన్ కి రికార్డు స్థాయిలో మొత్తం 971 మంది ఆటగాళ్లు తమ తమ పేర్లను నమోదు చేసుకున్నారని సమాచారం. కాగా ఈ సీజన్ కి సంబంధించినటువంటి వేలం పాట ఈ నెల 19 న కోల్ కతా లో జరగనుంది. కాగా ఈ సీజన్ లో మొత్తం 332 మంది క్రికెటర్లు ఖాళీగా ఉన్న 73 స్థానాల కోసం తీవ్రంగా పోటీ పడనున్నారని సమాచారం. కాగా ఈసారి మాత్రం అత్యధిక రిజర్వ్ ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించారని సమాచారం.

అయితే ఈ సీజన్ లోమాత్రం కొందరు భారత ఆటగాళ్లకు అన్యాయం జరుగుతుందని అందరు చెప్పుకుంటున్నారు. కాగా రాబిన్ ఉతప్ప రూ.1.5 కోట్లు, జయదేవ్ ఉనద్కట్ రూ.1 కోటి రూపాయలు పలుకగా, మిగిలిన వారందరు కూడా సగానికి పైగా తక్కువ ధరకే వేలం లో ఉన్నారని సమాచారం. ఇకపోతే మొత్తం 186 మంది భారతీయులు, 143 మంది విదేశీ ఆటగాళ్లు, ముగ్గురు అసోసియేట్ దేశాలకు చెందిన క్రికెటర్లు ఈ వేలంలో పాల్గొననున్నారు.