అన్ని ఫార్మాట్లకి రిటైర్మెంట్ ప్రకటించిన ఇర్ఫాన్ పఠాన్!

Sunday, January 5th, 2020, 01:28:13 AM IST

టీమిండియా క్రికెట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. దిగ్గజ క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్న అని అన్నారు. అయితే ఇన్నేళ్లు తనకి అండగా నిలిచిన అభిమానులు, స్నేహితులు, కుటుంబ సబ్యులకు ధన్యవాదాలు తెలిపారు. 2003 లో టీం ఇండియా లో చోటు సంపాదించుకున్న ఇర్ఫాన్, వన్డే, టెస్టు మ్యాచుల్లో తన సత్తా చూపించుకున్నాడు. భారత్ తరపున మొత్తం 120 వన్డేలు, 29 టెస్టులు, 24 టీ 20 లు ఆడిన ఇర్ఫాన్ పఠాన్ తక్కువ కాలంలోనే అత్యుత్తమ బౌలర్ గా ఎదిగాడు.

అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 306 వికెట్లు తీయగా అందులో అందులో వన్డేల్లో 173, టెస్టుల్లో 100 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా బాటింగ్ లో కూడా సత్తా చాటాడు. మొత్తం 11 అర్ద సెంచరీలు తన కెరీర్ లో చేసాడు. టెస్టుల్లో తోలి ఓవర్లోనే హ్యాట్రిక్ తీసిన ఒకే ఒక్క బౌలర్ గా రికార్డులకెక్కాడు. 2007 లో జరిగిన టీ 20 వరల్డ్ కప్ ఫైనల్లో మాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ లో ఎన్నో అద్భుత ఘట్టాలు వున్నాయి. కానీ గాయాల కారణం గా క్రికెట్ కు చాన్నాళ్లు దూరంగా వున్న ఇర్ఫాన్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు.