ఈ యువ ఆటగానికి సెల్యూట్ చేస్తున్న జడేజా.!

Wednesday, February 5th, 2020, 11:34:44 AM IST


ప్రస్తుతం ఒక పక్క భారత్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.అలాగే మరోపక్క అండర్ 19 వరల్డ్ కప్ మ్యాచులు కూడా జరుగుతున్నాయి.అయితే నిన్ననే భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మంచి రసవత్తరమైన పరిస్థితుల్లో పాకిస్థాన్ ఆటగాళ్లకు చుక్కలు చూపించి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా విజయాన్ని సాధించారు.దీనితో ఒక్కసారిగా దేశమంతటా ఈ ఆట మంచి హాట్ టాపిక్ అయ్యింది.

నిన్న జరిగినటువంటి ఈ మ్యాచ్ లో ఓపెనర్ బ్యాట్స్ మెన్ గా దిగి అద్భుతమైన ప్రదర్శనను కనబర్చిన “యశశ్వి జైస్వాల్” కోసం భారత జట్టులోని దిగ్గజ ఆటగాళ్లు కూడా చర్చిస్తూ సెల్యూట్ చేస్తున్నారు.తనలోని ప్రతిభకు తల్లిదండ్రుల సహకారం ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఈ యశస్వి జైస్వాల్ నిరూపించాడు.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ ఆటగాడు వైరల్ అవుతూనే ఉన్నాడు.అయితే “తన తండ్రితో పానీ పూరి అమ్మి జీవనం సాగించే స్థాయి నుంచి తాజాగా జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ లో అద్భుతమైన యావరేజ్ తో ఆకట్టుకునే స్థాయికి వచ్చిన యశశ్వి జైస్వాల్ కు సెల్యూట్ చేస్తున్నాను” అంటూ భారత్ ఆల్ రౌండర్ ఆటగాడు జడేజా ట్వీట్ చేసారు.దీనితో ఈ యువ ఆటగానికి మరింత స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.