ధోనిపై ఆరోపణలు.. కోహ్లీ ఫైర్

Wednesday, November 8th, 2017, 05:51:51 PM IST

మంగళవారం న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20 లో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఎంతో ఉత్కంఠతో జరిగిన ఈ మ్యాచ్ లో ఆటగాళ్లు ఫీల్డింగ్ లో బాగా రానించారని బౌలర్లు కూడా చివరలో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ లను దీటుగా ఎదుర్కొన్నారని ప్రముఖులు ప్రశంసించారు. అయితే న్యూజిలాండ్ పర్యటనలో అంతగా ఆకట్టుకొని ధోని పర్ఫామెన్స్ పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కోహ్లీ ఆ కామెంట్స్ కి తనదైన శైలిలో కౌంటర్స్ వేశాడు.

ధోనికి కేవలం వయసు పై బడిందనే కారణం చేత ఇలాంటి విమర్శలు చేస్తున్నారని జట్టులో ఆటగాడికి ఫిట్ నెస్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని చెప్పాడు. అంతే కాకుండా భారీ షాట్స్ ఆడే అవకాశం టాప్ ఆర్డర్ ఆటగాళ్లకు మాత్రమే ఉంటుందని మిడిల్ ఆర్డర్ లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు దిగేవారికి అంతగా అవకాశం ఉండదని చెబుతూ.. ఈ సిరీస్ లో ఎక్కువగా ధోనికి బ్యాటింగ్ రాలేదని వివరించాడు. అయితే ధోని మాత్రం జట్టును గెలిపించడానికి ఎదో ఒక రూపంలో తన బాధ్యతని చూపిస్తాడని తెలిపాడు. ఇక గత సిరీస్ లలో ధోని పర్ఫెమెన్స్ చాలా బావుందని జట్టుకు ధోని అవసరం ఇంకా చాలా ఉందని కోహ్లీ తెలియజేశాడు.

  •  
  •  
  •  
  •  

Comments