టెస్టుల్లో ఇక కోహ్లీనే నెంబర్ వన్… భారీ విజయం తరువాత.

Tuesday, September 3rd, 2019, 10:12:56 AM IST

వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ విజయం తో కోహ్లీ ధోని ని వెనుకకి నెట్టి ప్రధమ స్థానంలో వున్నాడు. కోహ్లీ కెప్టెన్ గా 28 టెస్ట్ మ్యాచుల విజయం తో ధోనిని వెనుకకు నెట్టాడు. వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ల్లో 257 పరుగుల భారీ తేడాతో ఓడించి టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకుంది. 468 భారీ పరుగుల లక్ష్య ఛేదన లో తీవ్రంగా విఫలమైన వెస్టిండీస్ 59. 5 ఓవర్లలో 210 పరుగులు చేసి అల్ అవుట్ ఐంది.

మహ్మద్‌ షమి, జడేజా మూడేసి వికెట్లు పడగొట్టగా, ఇషాంత్‌ శర్మ రెండు వికెట్లు తీసాడు. బుమ్రాకు ఒక వికెట్‌ దక్కింది. సెంచరీ, అర్ధసెంచరీతో సత్తా చాటిన తెలుగు తేజం విహారి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అందుకున్నాడు. మొదటి టెస్టులో కూడా టీమిండియా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ విజయం తో టీమిండియా ఐసీసీ వరల్డ్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో 120 పాయింట్లతో టాప్ స్థానంలో వుంది. న్యూజిలాండ్ 60 పాయింట్లతో రెండవస్థానంలో వుంది. ఈ టెస్ట్ మ్యాచ్ విజయం తో కోహ్లీ ధోనిని అధిగమించి భారత్ తరపున అత్యధిక టెస్ట్ మ్యాచుల విజయంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందు స్థానంలో వున్నాడు.